ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలి

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలి

మన్యం: జాతి భద్రత రీత్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ అప్రమత్తతపై జిల్లా కలెక్టర్‌లు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సంబంధిత శాఖల అధికారులతో ముఖ్య మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.