రాష్ట్రస్థాయి పోటీలకు ఖానాపూర్ విద్యార్థి

రాష్ట్రస్థాయి పోటీలకు ఖానాపూర్ విద్యార్థి

NRML: ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామానికి చెందిన పల్లెర్ల గణేష్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో నిర్వహించిన జొనల్ స్థాయి అండర్ 14 బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈయనను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, గ్రామస్తులు అభినందించారు.