అందుబాటులోకి అన్న క్యాంటీన్

అందుబాటులోకి అన్న క్యాంటీన్

TPT: చంద్రగిరిలో బుధవారం ప్రారంభించిన అన్న క్యాంటీన్ గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కూలి పనికి వెళ్లే వారు, పేద ప్రజలు రోజుకు ఉదయం టిఫిన్‌కు రూ.50 వరకు ఖర్చు అయ్యేది. ఈరోజు తక్కువ ధరకే ఆహారం అందడంతో వారు సంతోష పడుతున్నారు. రోజూ సంపాదించుకున్న కూలీ డబ్బులలో తక్కువ ఖర్చుతోనే మూడు పూటలా కడుపు నింపుకుంటున్నామని పేద ప్రజలు చెబుతున్నారు.