VIDEO: 'నీరు లేకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది'
NLR: వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుకాలం కష్టించి శ్రమించే రైతులకు ఇప్పుడు సాగు నీరు అందక వ్యవసాయం పూర్తిగా దెబ్బతినిందని వింజమూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువలో కంపచెట్లతో నిండిపోయి సాగునీరు వచ్చేదానికి వీల్లేకుండా పోయిందన్నారు. దీంతో పశువులకు మేత కూడా దొరక లేని స్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.