'ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత'

NLR: నెల్లూరు కలక్టరేట్లో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుమీద ఏర్పడిన నెల్లూరు జిల్లాకు కలెక్టర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు.