VIDEO: RTC వైఫల్యం.. ఉప్పల్‌లో తొక్కిసలాట
HYD: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు పట్నం నుంచి పల్లెకు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వేల సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల మధ్య వాగ్వాదం, తోపులాట, తొక్కిసలాట జరుగుతుంది. తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండకు స్పెషల్ బస్సులు వెయ్యాలని ప్రయాణికులు కోరారు.