బాలింతలకు నిత్యావసర సరుకుల పంపిణీ

SRD: పటాన్‌చెరు పట్టణంలోని ఎండీర్ ఫౌండేషన్ కార్యాలయంలో మాతృ దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్, తల్లి లక్ష్మి బాలింతలకు అవసరమైన నిత్యవసర వస్తువుల, బేబీ కిట్లను స్వయంగా పంపిణీ చేశారు. ఫౌండేషన్ చేపడుతున్న నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలను స్థానిక మహిళలు ప్రశంసించారు.