మెగా జాబ్ మేళాలో 112 మంది ఎంపిక

SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ జాబ్ మేళాలో 357 మంది నిరుద్యోగులకు 12 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు. 112 మందిని పలు సంస్థలకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు.