ఈనెల 17న నగరంలో డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమం
HYD: నగర పరిధిలో డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమం ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సుధా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకుజరిగే కార్యక్రమంలో కొత్త కాలనీలు, మున్సి పాలిటీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో అవసరాలపై సమాచారం సేకరిస్తామన్నారు. అన్ని డిపో మేనేజర్లను సంప్రదించొచ్చని తెలిపారు. రీజనల్ మేనేజరు 8885719194 నెంబర్‌లో సంప్రదించొచ్చు.