అశ్వరావుపేట సెంటర్లో చిరు వ్యాపారుల ధర్నా

అశ్వరావుపేట సెంటర్లో చిరు వ్యాపారుల ధర్నా

BDK: అశ్వరావుపేట మండలంలోని రింగ్ రోడ్ నందు రోడ్డు మరమ్మత్తులు సగంలో నిలిపివేయడం వలన రోడ్డు పక్కన చిరు వ్యాపారులు వాహనదారులు బాటసారులు అలాగే ఇబ్బందులకి గురి అవుతున్నారు.  ప్రతిరోజు వచ్చే దుమ్ము దూళికి తట్టుకోలేక రింగ్ రోడ్డులో ధర్నాకు దిగారు. అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో ఈరోజు ధర్నా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.