ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం: వైసీపీ
NDL: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మండల సీనియర్ నాయకులు పుల్యాల నాగి రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పగిడ్యాల మండలంలోని నెహ్రు నగర్ గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన చెప్పారు. మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రుల పాల్గొన్నారు.