సరదా కోసం ఈతకు వెళ్లి ప్రమాదానికి గురి కావొద్దు: SP
ASF: సరదా కోసం ఈతకు వెళ్లి ప్రమాదానికి గురి కావొద్దని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ గురువారం ప్రకటనలో సూచించారు. రేపటి నుండి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు అధిక వేడి నుండి జాగ్రత్తలు వహించాలని SP సూచించారు.