VIDEO: అందరూ HYD వాసులే: హజ్ కమిటీ
HYD: సౌదీ బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోయారని హజ్ కమిటీ వెల్లడించింది. మృతులంతా హైదరాబాద్ వాసులేనని, ప్రమాదంలో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు, 17 మంది పురుషులు మృతి చెందారన్నారు. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా జెడ్డాకు వెళ్లారని పేర్కొన్నారు.