రెడ్ క్రాస్ సమావేశం వాయిదా
AKP: ఈనెల 10న జరుగవలసిన రెడ్ క్రాస్ సాధారణ సమావేశం వాయిదా వేసినట్లు భారత రెడ్ క్రాస్ సొసైటీ, అనకాపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తదుపరి సాధారణ సమావేశం జరగబోవు తేది, సమయము, వేదిక త్వరలో తెలియజేయడం జరుగుతుందని ఆమె అన్నారు.