భద్రత దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలి: ఎస్పీ

భద్రత దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలి: ఎస్పీ

BDK: తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే సమయంలో ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదని ఎస్పీ రోహిత్ రాజు బుధవారం వెల్లడించారు. పొగ మంచులో ప్రయాణాలు చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. వాహనదారులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిదానంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు.