VIDEO: విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్
MDK: చేగుంట మండలం పోలంపల్లిలో ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. తనకు వీఆర్ఏ (VRA) ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రదీప్ కుమార్ అనే యువకుడు శుక్రవారం గ్రామ శివారులోని హైటెన్షన్ టవర్ పైకి ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అతడిని క్షేమంగా కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేపింది.