సతీమణికి ఎమ్మెల్యే పిండ ప్రదానం

ADB: బాసర గోదావరి నది వద్ద చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఆయన సతీమణి రూపకు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిండ ప్రదానం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఎమ్మెల్యే సతీమణి ఇటీవల అనారోగ్య కారణాలతో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందిన విషయం విదతమే. వారి వెంట బాసర మాజీ సర్పంచి రమేష్, పీఎసీఎస్ డైరెక్టర్ మమ్మయి నరేష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.