VIDEO: కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
KRNL: దేవనకొండలోని వడ్డే వీధిలో సోమవారం జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. వైద్య ఆరోగ్య కార్యకర్త తులసమ్మ మాట్లాడుతూ.. చర్మంపై స్పర్శ లేని, రాగి రంగు మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో ఈ కుష్టు నిర్మూలన అవగాహన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.