VIDEO: మత్తు పదార్థాల రవాణాపై సీబీఐ విచారణ చేపట్టాలి’
KRNL: నెల్లూరులో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కోరారు. అలానే గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల వ్యాపారాలపై సీబీఐ విచారణ జరపాలని పీపీఎస్ నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.