ఎమ్మెల్యేని కలిసిన నూతన పీఏసీఎస్ ఛైర్మన్లు

ఎమ్మెల్యేని కలిసిన నూతన పీఏసీఎస్ ఛైర్మన్లు

NLR: గుడ్లూరు, పోకూరు, దారకానిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నూతన ఛైర్మన్లు దామా వెంకటేశ్వర్లు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, నరాల మాలకొండరెడ్డి బుధవారం కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమను సొసైటీ ఛైర్మన్లుగా నియమించేందుకు సహకరించిన ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని వారు పేర్కొన్నారు