ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన
VSP: విశాఖలోని ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గెస్ట్ ఫ్యాకల్టీ శుక్రవారం ఆందోళనకు దిగారు. నెలవారీ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యను తక్షణం పరిష్కరించకపోతే నిరసన దీక్షలు చేపట్టే యోచనలో ఉన్నామని గెస్ట్ ఫ్యాకల్టీ ప్రతినిధులు తెలిపారు.