SDF నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులు..!

SDF నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులు..!

NLG: నిడమనూరు మండలం సోమోరి గూడెంలో స్పెషల్ డెవలప్‌మెంట్ నిధి నుంచి సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణం పనులకు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. కాగా ఇవాళ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యనారాయణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.