కొమురంభీం ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే
ADB: ఆదివాసీ పోరాటయోధుడు కొమురంభీం ఆశయ సాధనకు కృషి చేయాలనీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని నాగోబాగుడలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురంభీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ప్రజల కోసం పోరాడిన అమరుడు కొమురంభీం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.