రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

KMM: బోనకల్ మండలం రావినూతల వేబ్రిడ్జి వద్ద సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పొద్దుటూరుకు చెందిన కృష్ణారెడ్డి, వత్సవాయికి చెందిన బసవయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.