పోలమాంబ అమ్మవారి రాటోత్సవం
విశాఖలోని పెదవాల్తేరులో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతరలో భాగంగా శనివారం రాటోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా పందిరాట నిర్వహించారు. ఈనెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు వార్షికోత్సవాలు కొనసాగనున్నట్లు ఈవో టి. రాజగోపాల్ రెడ్డి తెలిపారు.