పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

ఖమ్మం నగరంలోని 10, 11, 12వ డివిజన్లలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యా ఆకస్మికంగా పరిశీలించారు. సిబ్బంది, నివాసితులతో మాట్లాడిన కమిషనర్, సమయానికి చెత్త సేకరణ, సరైన వ్యర్థ నిర్వహణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం రాజీ లేకుండా పరిశుభ్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు.