తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు కొత్త బాస్
TG: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్రబెల్లి స్వర్ణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతగా అనేక పదవులను నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. పీసీసీలో సుదీర్ఘకాలం అనేక పదవుల్లో కొనసాగారు.