బాలికల వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం
SKLM: వాలీబాల్ అండర్ 14 విభాగంలో బాలికలకు శిక్షణ తరగతులు ప్రారంభించామని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అడ్వైజర్ పి. సుందర్ రావు తెలిపారు. గురువారం నరసన్నపేట పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నెల్లూరులో ఈనెల 11 నుండి 13 వరకు జరుగుతున్నాయన్నారు. ఆ పోటీలకు జిల్లా నుండి ఈ జట్టును పంపుతున్నామన్నారు.