మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే
CTR: ఎస్.ఆర్ పురం మండలంలో నవంబర్ 13వ తేదీ 9 గంటలకు నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరిద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని MLA డాక్టర్ థామస్ అన్నారు. మండలం పుల్లూరు క్రాస్ రోడ్‌లో ఉన్న SLV కళ్యాణ మండపం మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. 10వ తరగతి ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ, బీఫార్మసీ ఇంజనీరింగ్ చదువుకున్న యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు.