స్కూల్ బస్సు కిందపడి వృద్ధురాలు మృతి

స్కూల్ బస్సు కిందపడి వృద్ధురాలు మృతి

NRML: స్కూల్ బస్సు కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సారంగాపూర్ మండలంలోని ఎస్సీ కాలనీలో బుధవారం జరిగింది. వివరాల ప్రకారం విద్యార్థులను ఎక్కించుకువెళ్ళడానికి వచ్చిన డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఇంటి ముందు నిలబడి ఉన్న దేవి సాయమ్మ బస్సు కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.