అలర్ట్: జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

అలర్ట్: జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

AKP: ద్రోణి ప్రభావంతో జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పొలాల్లో పని చేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు. పిడుగుల ముప్పు ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.