25 నుంచి పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన

25 నుంచి పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన

TG: HYDలోని హైటెక్స్‌లో ఈ నెల 25 నుంచి 28 వరకు పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన నిర్వహించనున్నట్లు భారత పౌల్ట్రీ పరికరాల తయారీ సంఘం వెల్లడించింది. దక్షిణాసియాలోనే ఇది అతి పెద్ద ప్రదర్శన అని పేర్కొంది. 'ఒక దేశం-ఒక గుడ్డు' నినాదంతో నిర్వహించే ఈ అంతర్జాతీయ ప్రదర్శనకు 50 దేశాల నుంచి 500 మందికి పైగా ప్రదర్శకులు, 40వేల మందికి పైగా సందర్శకులు హాజరవుతారని తెలిపింది.