'ఎరువుల పంపిణీకి చర్యలు'

SKLM: నరసన్నపేట పీఎసీఎస్ ద్వారా రైతులకు రాయితీపై ఎరువులు పంపిణీ చేసేందుకు సన్నద్ధం చేస్తున్నామని అధ్యక్షుడు అప్పారావు తెలిపారు. సోమవారం నరసన్నపేట కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి విడుదల 440 యూరియా, 440 బీజేపీ 50 కేజీల బస్తాలు వచ్చాయన్నారు. వీటిని తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు రైతులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.