మందు తాగి వాహనాలు నడిపితే చర్యలు

మందు తాగి వాహనాలు నడిపితే చర్యలు

VZM: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని బొండపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. ఒకప్పుడు మద్యం తాగి వాహనాలు నడిపితే ఫైన్లు మాత్రమే ఉండేవని ఇప్పుడు ఫైన్లతో పాటు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అందువలన ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు.