‘ఎస్టీలకు రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి’
ATP: యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని జేఎన్‌టీయూ, ఎస్కేయూలో రిజర్వేషన్ల అమలుపై ఆయన సమీక్షించారు. 2008 నుంచి భర్తీ చేసిన బ్యాక్‌లాగ్ పోస్టులు, రోస్టర్ పాయింట్లు, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు.