VIDEO: చెట్టును ఢీకొని కార్మికులపై బోల్తా పడిన కారు
MDCL: జవహర్నగర్ PS పరిధిలో అంబేద్కర్ నగర్‌లోని మిలీనియం పాఠశాల సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు చెట్టును ఢీకొని, బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రదీప్, రవి అనే ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.