ఊటకొండలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ట

ఊటకొండలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ట

NDL: ప్యాపిలి మండలం ఊటకొండలో బుధవారం మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది.ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాల్మీకి మహర్షి భారతీయ సాంస్కృతి, సాహిత్యంలో ఉన్నత స్థానాన్ని సంపాదించారని ఆయన కొనియాడారు. రామాయణం వంటి అద్భుత కావ్యాన్ని అందించిన మహర్షి ఆలోచనలు మార్గదర్శకమని పేర్కొన్నారు.