కేంద్ర మంత్రితో మండల అధ్యక్షుడు భేటీ

కేంద్ర మంత్రితో మండల అధ్యక్షుడు భేటీ

SKLM: సోంపేట మండల టీడీపీ అధ్యక్షుడు మడ్డు కుమార్ గురువారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బారువ పంచాయతీలో సుంకర వీధిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం, బారువ బీచ్‌‌లో సోలార్ లైట్లు ఏర్పాటు, సుందరీకరణ పనులకు సహకరించాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.