ఖమ్మం రూరల్ ఎస్సై విశ్వతేజకు ప్రశంసా పత్రం

KMM: ఖమ్మం రూరల్ ఎస్సై విశ్వతేజకు ప్రశంసా పత్రం లభించింది. విధుల పట్ల ప్రతిభ కనబరుస్తూ.. అంకితభావంతో సేవలందించినందుకుగాను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సైను ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ రాజు అభినందించారు.