కంగారూలను ఓడించిన రికార్డ్ కోహ్లీ సేనదే!
ఆస్ట్రేలియాకు పెర్త్ మరో కంచుకోటగా మారింది. యాషెస్ తొలి టెస్ట్ సహా ఇక్కడ ఆడిన 6 టెస్టుల్లో ఆ జట్టు ఒక్కటే ఓడింది. ఈ క్రమంలో కంగారులపై గెలిచిన ఏకైక పర్యాటక జట్టుగా కోహ్లీ నేతృత్వంలోని భారత్ కొనసాగుతోంది. 2024లో కోహ్లీ సేన 295 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 1988(విండీస్) తర్వాత 2021లో కంగారుల అసలైన కంచుకోట గబ్బాను ఛేదించిన జట్టుగానూ కోహ్లీ సేన నిలిచింది.