అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలో ఏకరూప దుస్తులు
PPM: అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలోనే ఏకరూప చీరలను అందజేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురంలో మంగళవారం నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 600 మంది కార్యకర్తలు ఉద్యోగ విరమణ చేస్తారని, వారందరినీ గౌరవప్రదంగా పంపించేందుకు గ్రాట్యుటీని మంజూరు చేస్తామని పేర్కొన్నారు.