గోకవరంలో మద్యం మత్తులో యువకులు హల్ చల్
తూ.గో: గోకవరంలోని లూథరన్ చర్చి వద్ద శ్రమల కాలం ధ్యాన కూడికలో ఉన్న క్రైస్తవులపై మద్యం సేవించిన కొందరు యువకులు మంగళవారం సాయంత్రం దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన క్రైస్తవ సంఘస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ప్రార్థనలకు ఆటంకం కలిగించిన నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.