చంద్రబాబుపై పేర్నినాని ఫైర్
AP: 2019కి ముందు మోదీ కూడా చంద్రబాబు యూటర్న్‌లపై మాట్లాడారని మాజీ మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. 'చంద్రబాబు టార్చ్ లైట్ మంత్రి అని దగ్గుబాటి పుస్తకంలో రాశారు. 2015లో CRDA అమరావతికి మాత్రమే మాస్టర్ ప్లాన్ చేశారు. ఇతర నగరాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు చేయలేదు. జగన్ మావిగన్ అనగానే హడావుడిగా RVR అసోసియేట్స్‌తో కొత్త మాస్టర్ ప్లాన్ చేయించారు' అంటూ విమర్శించారు.