చలికాలంలో గుండెపోటు ప్రమాదం ఎందుకు?
చలికాలం ఉదయం అధిక రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారిలో గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అలాంటి వారు మార్నింగ్ వర్కౌట్, వాకింగ్ మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నడకకు వెళ్తే చెవులు, ఛాతీ, కాళ్లు, తలను కప్పుకోవాలి. నిద్రలేచిన వెంటనే, శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా గుండెపోటు వస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.