VIDEO: కోకో రైతుల రాష్ట్ర సంఘం కమిటీ సమావేశం
ELR: కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శనివారం ఏలూరు పవర్ పేటలోని అన్నే భవనంలో ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.