గుర్తుతెలియని మృతదేహం లభ్యం

SRPT: కోదాడ మండలం కాపుగల్లు గ్రామ శివారులో గుర్తుతెలియని పురుషుని మృతదేహం లభ్యమైనట్లు, గురువారం సాయంత్రం కోదాడ మండల పోలీసులు తెలిపారు. కాపుగల్లు శివారులోని ఎన్ఎస్పీ కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.