తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి స్వామి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి స్వామి

ప్రకాశం: కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన మంత్రికి ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం మంత్రి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.