కలెక్టర్‌ను కలిసిన నూతన డీపీవో

కలెక్టర్‌ను కలిసిన నూతన డీపీవో

జనగామ జిల్లా డీపీవోగా ఏ.నవీన్ నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అధికారిక విధులపై, బాలల సంక్షేమం, విద్య, పోషణా పథకాల అమలుపై చర్చించారు. కలెక్టర్, నవీన్‌కు అభినందనలు తెలియజేసి సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.