మల్లవరం గ్రామంలో రీ సర్వేపై అవగాహన ర్యాలీ

ప్రకాశం: మద్దిపాడు మండలంలోని మల్లవరంలో రీ సర్వేపై బుధవారం రెవెన్యూ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. గ్రామంలో ఉన్నటువంటి భూమినంతటిని సర్వే చేసి రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల్లో రీ-సర్వేపై ఉన్న అపోహలను తొలగించడానికి అవగాహన సదస్సుని, ర్యాలీని నిర్వహించామన్నారు.