‘బీహార్ ప్రజలకు ఇది నా వాగ్దానం’
బీహార్ రోడ్ల అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 'ప్రపంచ ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలో హైవేలను నిర్మిస్తానని హామీ ఇస్తున్నాను. బీహార్ రోడ్లను అమెరికాతో సమానంగా తీర్చిదిద్దే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది నా వాగ్దానం. నేను మీకు సహాయం చేయడం లేదు. ఇది మీ డబ్బు.. మీరు యజమాని, మేము సేవకులం. మేము మీకు నిజాయితీగా సేవ చేస్తాము' అని గడ్కరీ స్పష్టం చేశారు.